విచారణకు రెడీ.. తాడో పేడో?

29
- Advertisement -

ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ అగ్రనాయకులపై పలు స్కామ్ లు తెరపైకి వస్తు పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ నిమిత్తం 20 రోజులకు పైగా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నారా లోకేశ్ చుట్టూ స్కామ్ లు అలుముకుంటున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో భాగంగా నారా లోకేశ్ ను ఏ 14గా పరిగణించిన ఏపీ సీఐడీ ఆయనకు వాట్సప్ ద్వార నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఫిజికల్ గా నోటీసులు అందజేయాల్సినందున సీఐడీ అధికారులు డిల్లీ వెళ్ళి మరి నోటీసులు అందజేశారు. .

గత కొన్ని రోజులుగా లోకేశ్ డిల్లీలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. కాగా నోటీసులు అందుకున్న లోకేష్ ను ఈ నెల 4వ తేదీన సీఐడీ ఆఫీస్ లో విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు కోరారు. దానికి లోకేష్ విచారణకు హాజరవుతానని, తనకు అందిన నోటీసులో తాను తాను తప్పు చేసినట్లు ఎలాంటి లేవని.. ఈ కేసులన్నీ కక్షపూరితమే అంటూ కొట్టి పారేశారు. పది సంవత్సరాలు బెయిల్ పై ఉన్నవాళ్ళు తనపై కేసులు పెడుతున్నారని పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పించారు.

తను తప్పు చేయనప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదని తప్పకుండా విచారణకు హాజరవుతాని లోకేష్ చెప్పుకొచ్చారు. దీంతో 4వ తేదీ ఏం జరగబోతుంది ? అనే ఆసక్తి ఏపీ రాజకీయాల్లో హీట్ ను పెంచుతోంది. అయితే విచారణకు హాజరు కానీ పక్షంలో అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నోటీసులో సీఐడీ స్పష్టంగా పేర్కొన్నాట్లు తెలుస్తోంది. దీంతో 4వ తేదీ విచారణలో భాగంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. అసలే లోకేష్ కూడా జైలుకు వెళ్ళడం ఖాయమని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విచారణ అనంతరం లోకేష్ ను కస్టడీలోకి తీసుకున్న ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Also Read:కాంగ్రెస్ ‘బీసీ’ గోల!

- Advertisement -