కాంగ్రెస్‌లోకి నామా..ఖమ్మం ఎంపీగా పోటీ..!

218
nama nageshwara rao
- Advertisement -

తెలంగాణ టీడీపీ సీనియర్ నేత,మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరికకు రంగం సిద్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుండి పోటీచేసిన ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగా కాంగ్రెస్లో చేరి ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన నామా ఖమ్మం పార్లమెంట్ స్ధానం నుండి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖమ్మం ఎంపీ సీటు టీడీపీ కేటాయించేలా కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం నేపథ్యంలో ఒంటరి పోటీకే మొగ్గుచూపింది కాంగ్రెస్.

దీంతో కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం నుండి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు నామా. అయితే కాంగ్రెస్‌ నుండి రేణుకా చౌదరి,పొంగులేటి సుధాకర్ రెడ్డి, పారిశ్రామిక వేత్త వృద్ధిరాజు రవిచంద్ర పేర్లు పరిశీలనలో ఉన్న నామా కాంగ్రెస్లో చేరితే ఆయకే సీటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వం కూడా నామా పార్టీలో చేరికపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక నామాబాటలోనే మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నలుగురు సిట్టింగ్‌లకు టీఆర్ఎస్ టికెట్ నిరాకరిస్తున్నట్లు వార్తలు వెలువడుతుండగా అందులో జితేందర్‌ రెడ్డితో పాటు ఖమ్మం ఎంపీ పొంగులేటి,వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్,మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జితేందర్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా ఖమ్మం ఎంపీ పొంగులేటి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వెలువుడుతన్నాయి.

- Advertisement -