వైసీపీ భూ స్థాపితం కావడం ఖాయం: బుద్దా వెంకన్న

0
- Advertisement -

మాజీ సీఎం జగన్‌పై టీడీపీ నేత బుద్దావెంకన్న సంచనల కామెంట్స్ చేశారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి వైసీపీ నేతలకు సిగ్గు ఉండాలని మండిపడ్డారు. ప్రజలు వరదల్లో అల్లాడిపోతే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అని బుద్ధా వెంకన్న అన్నారు. ఏనాడైనా బురదలో అడుగుపెట్టి ప్రజలను కలిశావా? నువ్వా పేద ప్రజల గురించి మాట్లాడేదని మండిపడ్డారు. వరద బాధితుల కోసం కోటి రూపాయలు ప్రకటించిన వైఎస్‌ జగన్‌.. ఎవరికి ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించారు

అబద్ధాలు ప్రచారం చేసే అడ్రస్‌ లేకుండా వెళ్లారని.. ఇప్పుడు మళ్లీ అలాగే చేస్తే వైసీపీ భూ స్థాపితం కావడం ఖాయమని విమర్శించారు.అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. దమ్ముంటే అవినీతి జరిగిందని చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నాయకులకు సవాలు విసిరారు.

వరదల సమయంలో బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమని బుద్ధా వెంకన్న కొనియాడారు. చంద్రబాబు వల్లే ఈ వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డామని ప్రజలు చెబుతుంటే.. వైసీపీ నేతలు భరించలేకపోతున్నారని మండిపడ్డారు.

Also Read:Harishrao:వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణ

- Advertisement -