చంద్రయ్య పాడె మోసిన చంద్రబాబు..

19

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు తోట చంద్రయ్య హత్యకు గురికావడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. హత్య కు గురైన తోట చంద్రయ్య కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించారు. తమ పార్టీ శ్రేణులను భయాందోళనలకు గురిచేసేందుకు వైసీపీ రౌడీమూకలే ఈ ఘాతుకానికి పాల్పడ్డాయంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చంద్రయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. అంతేకాదు, చంద్రయ్య అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఈ అంతిమయాత్రకు టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.