చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న మంత్రి సత్యవతి..

17

గురువారం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముచ్చింతల్ దివ్య సాకేతంలో జరిగిన పూజలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. ఈ సందర్భంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే సహస్రాబ్ది సమారోహంలో పాల్గొనడానికి జీయర్ స్వామి వారు, మంత్రిని ఆహ్వానించారు. ఈ పూజ కార్యక్రమంలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు కూడా పాల్గొన్నారు.