శబరిమల వివాదం..రివ్యూ యోచనలో టీడీబీ

256
kerala tdb
- Advertisement -

కేరళలో  శబరిమల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. సుప్రీం నిర్ణయంతో మహిళలు దేవస్థానంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని భక్తులు అడ్డుకున్నారు. దీంతో కేరళలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంతీర్పుపై రివ్యూపిటిషన్ వేయాలని ట్రవెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది.

గురువారం ఇద్దరు మహిళలు, ఇవాళ ఓ మహిళా జర్నలిస్టుతో సహా మరో ఇద్దరు మహిళలు సన్నిధానం వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారికి రక్షణగా నిలిచినా.. అయ్యప్ప దర్శనం కాలేదు. వారు గర్భగుడి వద్దకు వస్తే ఆలయాన్ని మూసివేస్తామని ప్రధాన అర్చకుడు గట్టిగా హెచ్చరించడం, ఎప్పుడూ లేని విధంగా దాదాపు 35 మంది సహాయ అర్చకులు పూజల్లో పాల్గొనకపోవడంతో స్వామి దర్శనం చేస్తామని తొలుత పట్టుపట్టిన ఆ మహిళలు వెనక్కితగ్గారు.

దీంతో శబరిమల కొండలు శుక్రవారం ‘స్వామియే శరణం అయ్యప్పా’ అన్న నినాదంతో ప్రతిధ్వనించాయి. ఈ శరణుఘోషను భక్తులు తొలుత నిరసన తెలపడానికి ఉపయోగించుకున్నారు. ఐజీ శ్రీజిత్ మాట్లాడుతూ భక్తుల మనోభావాల విషయంలో తానేమీ చేయలేనని, సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను తాను పాటించాల్సివుందని, దయచేసి అడ్డుతొలగాలని
ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ప్రయోజనం లేకపోయింది.

- Advertisement -