పోస్టు ప్రొడక్షన్‌లో దటీజ్ మహాలక్ష్మి

258
Tamannaah
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటించిన చిత్రం ‘క్వీన్’. సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని భాషల్లోకి ఈ చిత్రాన్ని ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. కాగా, తెలుగు వెర్షన్ కి ‘దటీజ్ మహాలక్ష్మి’ టైటిల్ ను ఖరారు చేశారు. తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

గతంలో విడుదలైన ‘100% లవ్ చిత్రం’లో మహాలక్ష్మి పాత్రలో తాను నటించిన విషయాన్ని గుర్తుచేసుకుంది. ఇప్పుడు, ఇదే పేరును ఈ చిత్రానికి పెట్టడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది.

దటీజ్ మహాలక్ష్మిగా తమన్నా లుక్ అదిరిపోయింది. చీర కట్టు, కళ్లజోడుతో ఇంతకుముందు కంటే కాస్త బొద్దుగా కనిపించింది. సిద్దు జొన్నలగడ్డ, జివిఎల్‌ నరసింహరావ్‌, మాస్టర్‌ సంపత్‌ కీలక పాత్రలు పోషిస్తుండగా మనుకుమార్‌ నిర్మాత. కాగా, కన్నడలో పరుల్ యాదవ్, తమిళంలో కాజల్, మలయాళంలో మాంజిమా మోహన్ లు టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు.

- Advertisement -