బండి యాత్రకు సీనియర్ల మద్దతు కరువు..

38
bandi sanjay
- Advertisement -

తెలంగాణ కమలం పార్టీలో నేతల మద్య లుక-లుకలు బయటపడుతున్నాయి. బీజేపీలో నాయకుల మధ్య సఖ్యత లోపిస్తుందా..? ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు అప్పుడే నేతల మధ్య నువ్వా నేనా అనే వార్ మొదలైందా..? ఎవరికి వారే నేనే ఫైనల్ అంటూ అటు సీనియర్ నేతలు.. పార్టీ అధ్యక్షుడు క్యాడర్ ముందు గొప్పలు చెపుకుంటున్నారా..? అసలు పార్టీలోనే చాలా మంది నేతలు వ్యతిరేకిస్తున్నా.. బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేపట్టినట్లు..? సీనియర్ నేతలపై బండి పరోక్ష వ్యాఖ్యలేందుకు చేస్తున్నట్లు..? రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతున్న సందేహాలు.. పార్టీకి బలమే లేనప్పప్పడు యాత్ర ఎందుకంటున్న సీనియర్లు ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కీలక చర్చ మారింది.. ఓ వైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట జిల్లాలు పట్టుకోని తిరుగుతుంటే.. పార్టీలోని సీనియర్లు మాత్రం పార్టీ హైకమాండ్ పెద్దల ముందు అసంతృప్తుల పర్వానికి తెరలేపుతున్నారు.. పార్టీలో బండి సంజయ్ ఒంటెత్తు పోకడలు.. తమకు సరైన ప్రాధాన్యత లేకపోవడం.. కీలక అంశాల్లో తమను పరిగణలోకి తీసుకోకపోవడం లాంటి అవమానాలను కేంద్ర కమిటీ సభ్యుల ముందు వాపోతున్నారు.

ఇక రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను మొదలు పెట్టిన బండి సంజయ్ కు అయా జిల్లాల్లోని సీనియర్ నేతలు అస్సలు సహకరించడం లేదని చర్చ నడుస్తోంది. ముందుగా పార్టీని పటిష్ట పర్చకుండా యాత్రలు చేస్తే అసలుకే మోసమొచ్చే అవకాశం ఉందని సీనియర్లు మొత్తుకుంటున్నా బండి మాత్రం యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు.. దీంతో పాటు పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు వస్తాయన్నారు.. దీంతో పాటు బీజేపీలో వ్యక్తుల కోసం పని చేసేవారికి టికెట్లు రావని పరోక్షంగా కౌంటర్ విసిరారు. పార్టీలోని ఇద్దరు ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు పని చేస్తున్నారని బండి సంచలన వ్యాఖ్యలే చేశారు.ఇక బండి సంజయ్ తీరుపై చాలా రోజులుగా గుర్రుగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం తన అనుచరులతో తానే సీఎం అభ్యర్థిని అని చెప్పుకుంటున్నారు.. ఇదే అంశంపై బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. తాము ముఖ్యమంత్రి అవుతామని చెప్పుకునే వాళ్లు బీజేపీలో సీఎం కాలేరన్నారు. ఇక టికెట్లు ఇప్పిస్తామని చెప్పి కొందరు నేతలు పార్టీలో కొత్తగా చేరిన నేతలు తమ వైపు తిప్పుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సొంత ప్రయోజనాల కోసం కిషన్ రెడ్డి లాంటి వారు పని చేస్తున్నారని బండి సంజయ్ వ్యాఖ్యలతో కిషన్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన టికెట్ కే దిక్కులేదని బండి సంజయ్ వాపోతుండటం లోకల్ బీజేపీ పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది.

ఇక ప్రస్తుతం బీజేపీలో బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గాల మధ్య వార్ గట్టిగానే కొనసాగుతోంది. తెలంగాణ బీజేపీ సీనియర్‌ నేతగా, కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెనుదుమారమే రేపుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీలో గ్రూపులు పెరిగిపోతున్నాయి. కొంతమంది నేతలు తమ అనుచరులు, వ్యక్తులకు టికెట్లు ఇప్పించేందుకు ఢిల్లీ లేవల్ లో జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు సొంత పార్టీ నాయకుల మద్దతు లభించే పరిస్థితి ఎక్కడా కనిపించడంలేదు. బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది. బండి సంజయ్ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో జనసమీకరణ కోసం నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు.. ఈ విషయం బండి సంజయ్ యాత్రలో జనం లేకపోవడాన్ని చూస్తే ప్రజల్లో బీజేపీ పార్టీ పట్ల ఆసక్తి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

- Advertisement -