టీబీజీకేఎస్‌కు ప్రత్యామ్నాయం లేదు…

1131
tbgks
- Advertisement -

కోల్ ఇండియాలో లేని విధంగా సింగరేణిలో కారుణ్య నియామకాలు అమలుచేస్తున్నా ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్,ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన వారు కారుణ నియామకాల కోసం 6 వేల మంది కార్మికులు దరఖాస్తు చేసుకోగా అందులో 4 వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు చేస్తున్నారు, 5 వందల మంది ట్రైనింగ్‌లో ఉన్నారని చెప్పారు.

టీబీజీకేఎస్‌లో చీలికలు లేవు,అందరం కలిసే ఉన్నాము,కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి పార్టీ గెలుపుకు కృషి చేస్తాం అని వెంకట్రావు చెప్పారు.

వచ్చేకార్మిక సంఘం ఎన్నికలలో అన్ని జాతీయ సంఘాలు ఏకమై పోటీ చేసిన టిబిజికెఎస్ ను ఓడించలేవన్నారు రాజిరెడ్డి. సింగరేణి సంస్థలో టిబిజికెఎస్ కు ప్రత్యామ్నాయ సంఘం లేదని …జాతీయ కార్మిక సంఘాలు పోగొట్టిన కార్మికుల హక్కులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సాధించిందని చెప్పారు.

- Advertisement -