మెగా ఫ్యామిలీ మూవీపై వెనక్కితగ్గిన వర్మ..!

568
rgv
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. తన సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచే వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే మూవీతో ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేశాడు. ఇప్పటికే ఈ మూవీ టైటిల్‌పై వర్మపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా ఏ మాత్రం తగ్గని వర్మ తన నెక్ట్స్‌ మూవీని అనౌన్స్ చేశాడు.

ఈ సారి మెగాస్టార్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యామిలీ అనే టైటిల్‌తో సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో టీ టౌన్‌లో ఆర్జీవీ నెక్ట్స్ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ఎలా ఉండబోతుంది…ఎలా తీయనున్నాడు అనే ఆసక్తి అందరిలో నెలకొనగా టైటిల్ అనౌన్స్‌ చేసిన 24 గంటలు గడవక ముందే మనసు మార్చుకున్నాడు వర్మ.

తాజాగా ట్విట్టర్ ద్వారా మెగా ఫ్యామిలీ సినిమా తీయట్లేదని ప్రకటించాడు. మెగా ఫ్యామిలీ అంటే ఓ వ్యక్తికి 39 మంది సంతానం….తనకు పిల్లలంటే ఇష్టం ఉండదు అందుకే మెగా ఫ్యామిలీ అనే టైటిల్‌తో సినిమా తీయట్లేదని చెప్పాడు.

- Advertisement -