‘టాక్సీవాలా’ మాటే వినదుగా..సాంగ్‌

302
- Advertisement -

విజయ్ దేవరకొండ ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న యంగ్‌ హీరో. ఇటీవల వచ్చినా ‘నోటా’ సినిమాతో తమిళ ప్రేక్షకులకూ పరిచయమయ్యారు విజయ్‌.‘గీత గోవిందం’ చిత్రంతో తన మార్కెట్ ఏ స్థాయిలో ఉందో నిరూపించాడు విజయ్‌. ఇప్పుడు ‘టాక్సీవాలా’ సినిమాలో చేస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ కొన్ని అనివార్య కారణాల వలన ఆలస్యమైంది. రీసెంట్‌గా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. నవంబర్ 16వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

Taxiwaala Movie 1st Song

విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఈ నెల 26వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు ‘మాటే వినదుగా .. ‘ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇంతవరకూ విజయ్ దేవరకొండను మాత్రమే పోస్టర్స్‌లో చూపిస్తూ వచ్చారు. తాజా పోస్టర్‌లో కథానాయికగా ప్రియాంక జవల్కర్ ను కూడా చూపించారు.

- Advertisement -