టాక్ లండన్ బోనాల జాతర పోస్టర్ రిలీజ్: శ్రీనివాస్ గౌడ్

122
minister srinivas gaud
- Advertisement -

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో జులై 3 వ తేదీనాడు లండన్ లో నిర్వహిస్తున్న ‘టాక్ -లండన్ బోనాల జాతర’ పోస్టర్ ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న టాక్ సంస్థను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరు కావాలని తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఎమ్మల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ని ఆహ్వానించినట్టు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు. పోస్టర్ ఆవిష్కరించడమే కాకుండా అన్ని వేళలా టాక్ సంస్థను ప్రోత్సహిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి, అలాగే సంస్థ ఆవిర్భావం నుండి టాక్ ప్రయాణంలో అడుగడుగునా మా వెంటే ఉండి ముందుకు నడుస్తున్న ఎమ్మెల్సీ కవిత కి మరియు కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కి రత్నాకర్ కడుదుల ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై నాయకులు రాజ్ కుమార్ శానబోయిన, శ్రీనివాస్ వల్లాల మరియు విద్యార్ధి నాయకుడు ప్రమోద్ కక్కెర్ల పాల్గొన్నారు.

- Advertisement -