బ్రహ్మాస్త్రం ట్రైలర్ రిలీజ్…

74
Bramhastram
- Advertisement -

స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ బ్యానర్ పై బాలీవుడ్ స్టార్‌కపుల్ ర‌ణబీర్ క‌పూర్ , ఆలియా భ‌ట్ జంట‌గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్రం “బ్రహ్మాస్త్ర” . తెలుగులో “బ్రహ్మాస్త్రం” పేరుతో దీనిని విడుదలచేయనున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో మొదలైన “బ్రహ్మాస్త్రం” ట్రైలర్ ను నేడు అధికారికంగా రిలీజ్ చేసారు.

ఈ చిత్రం లో అమితాబ్ బ‌చ్చన్ , హీరో నాగార్జున కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని సెప్టెంబర్ 9న హిందీ వెర్షన్ తో పాటు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

గ్రాఫిక్స్ మాయాజాలంతో.. విజువల్ వండర్ గా రూపొందుతోన్న “బ్రహ్మాస్త్రం” చిత్రం ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులలో భారి అంచనాలను పెంచేసింది. ఇక సినిమా విషయానికి వస్తే “బ్రహ్మాస్త్రం” చిత్రం మూడు భాగాలుగా విడుదల కాబోతోందని, త్రిమూర్తుల తత్వాన్ని సోషియో ఫాంటసీ జోనర్ లో అయాన్ ముఖర్జీ తెలపబోతున్నారని, వీటిలో మొదటి భాగం “శివ” ఇప్పుడు విడుదలకు సిద్ధమైందని తెలుస్తుంది . బ్రహ్మ , విష్ణు భాగాలు దీని తర్వాత విడుదల కాబోతున్నాయట. ఇక ఈ సినిమా ప్రేక్షకాభిమానులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.

- Advertisement -