ఇటీవల లండన్ నుండి సెలవుల పై హైదరాబాద్ వెళ్లిన టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది, ఎంపీ కవితని కలుసుకొని టాక్ సంస్థకు ఇస్తున్న ప్రోత్సాహానికి ప్రత్యేక కృతఙతలు తెలిపారు.
లండన్ లో జరిగిన బోనాల జాతరను చాలా ఘనంగా నిర్వహించారని, నేను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో వార్తలు చూశానని, ముఖ్యంగా ప్రవాసులలో చేనేత వస్త్రాల మరియు కార్మికులకు మద్దత్తు పై అవగాహన కలిగించే కార్యక్రమం బాగుందని ఎంపీ కవిత ప్రశంసించారు.
టాక్ భవిష్యత్తు కార్యక్రమాలని కవిత వివరించి వారి సూచనలను – సలహాలను కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా తీర్చి దిద్దడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న కృషిలో బాగస్వాములమవుతామని, తెలంగాణ నాయకత్వం ఎటువంటి దిశా నిర్దేశం చేసినా అన్ని వేళల ముందుండి పని చేస్తామని పవిత్ర కంది తెలిపారు.
ఈ కార్యక్రమం లో అధ్యక్షురాలు పవిత్ర కంది కుటుంబ సభ్యుల తో పాటు సంస్థ ప్రతినిధులు – ఎన్నారై టి. ఆర్.యస్ నాయకుడు రాజ్ కుమార్ శానబోయిన పాల్గొన్నవారిలో ఉన్నారు.