2024 మార్చి నాటికి విస్తారాను ఎయిర్ ఇండియాలో కలిపేసుకుంటామని టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. విస్తారాలో టాటాకు 51శాతం ఉండగా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49శాతం వాటా కలిగి ఉంది. దీంతో విస్తారా కలవడంతో…సింగపూర్ ఎయిర్ లైన్స్ కు 25శాతం విలువైన మొత్తం రూ.2000కోట్లకు పైగా పెట్టుబడి ఎయిర్ ఇండియాలో పెట్టెందుకు అవకాశం ఉంటుంది.
టాటాకు 218 విమానాలు కలిగి ఉండగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద క్యారియర్ నిలవనుంది. ఎయిర్ ఇండియా 113, ఎయిర్ ఏసియా ఇండియా 28, విస్తారా 53 మరియు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 24తో భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్‌గా నిలవనుంది.
వచ్చే ఐదేళ్లలో ఎయిర్ ఇండియాలోకి ఇప్పుడు ఉన్న విమానాల కంటే మూడు రెట్లు అధికంగా ఉండే విధంగా ప్రణాళికలు రచిస్తుందని ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. గతేడాది టాటా ప్రభుత్వం దగ్గర నుంచి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి…