కరకరలాడే మురుకులు ఇలా చేస్తే.. సూపర్!

87
- Advertisement -

పండగలు వస్తున్నాయంటే ఇంట్లో పిండి వంటల హడావిడి మామూలుగా ఉండదు.. రకరకాల పిండి వంటలు చేస్తూ పండగ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఉంటారు. ఇలా అందరూ చేసే పిండి వంటలలో మురుకులు కూడా ఒకటి. ఈ మురుకులను పండగ సమయాల్లోనే కాకుండా ప్రతిరోజూ స్నాక్స్ గా కూడా చేసుకొని తింటూ ఉంటారు చాలమంది. అయితే మురుకులను చాలా రకాలుగా చేయవచ్చు. కానీ అన్నీ సంబర్భాలలో పర్ఫెక్ట్ గా మురుకులను చేయడం అందరికీ సాధ్యం కాదు. అయితే మురుకులను కరకలాడుతూ ప్రతిఒక్కరు తయారు చేసుకునే విధంగా ఎంతో టేస్టీ గా క్రిస్పీ గా ఎలా తయారు చేయాలో చూద్దాం !

మురుకుల తయారీకి కావల్సిన పదార్థాలు
బియ్యం – రెండు కిలోలు, శనగపప్పు – కిలో, మినపప్పు – అర కిలో, కారం – రెండు టీ స్పూన్లు, ఉప్పు- తగినంతా, వాము – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడినంత

తయారు చేయు విధానం

ముందుగా బియ్యం, శనగపప్పు, మినపప్పు.. మూడింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత ఉప్పు, కారం, కొద్దిగా వాము వేసుకొని బాగా కలపాలి. ఆ తరువాత అరకప్పు నెయ్యి వేసుకొని, కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ పిండిని బాగా కలపాలి. కొంత సమయం అలాగే కలిపిన తరువాత పిండిపై మూత వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. కొంత సమయం తరువాత కళాయిలో డీప్ ప్రై కి సరిపడినంతా నూనె పోసుకొని బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక మరుకుల గొట్టాన్ని తీసుకొని దానికి కాసింత నూనె రాసి దానిలో పిండిని తగినంత తీసుకొని వేడి అయిన నూనెలో వత్తుకోవాలి. ఇలా చేసిన తరువాత మంటను మీడియం ఫ్లెవర్ లో ఉంచుకొని మరుకులు రెండు వైపులా లేత బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలాగే ఉంచి ఆ తరువాత ప్లేట్ లోకి తూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మురుకులు ఎంతో క్రిస్పీ గా రుచిగా ఉంటాయి,. ఇలా కరకరలాడే మురుగులను పండగ సమయాల్లోనూ లేదా రోజు స్నాక్స్ గా కూడా తయారు చేసుకోవచ్చు.

Also Read:పెదవులు పగిలితే.. ఇలా చేయండి!

 

- Advertisement -