భోగి పండుగ విశిష్టత.. ఏంటో తెలుసా?

18
- Advertisement -

మన దేశం హిందూ దేశం కావడం వల్ల భిన్న మతాలు, భిన్న సంస్కృతులు తరస పడుతుంటాయి. ప్రతిఒక్కరికీ వారి కుల మతాల ఆధారంగా పండుగలు వస్తుంటాయి. వాటిని ఎంతో నిష్టగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అయితే అన్ని కులాల వారు మతాల వారు కలిసి కట్టుగా జరుపుకునే పండుగలు చాలా తక్కువ ఉంటాయి. అలట్నీ ప్రత్యేకమైన పండుగలలో మకర సక్రాంతి ఒకటి. మూడు రోజుల పాటు సాగే ఈ పండుగను భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పల్లె సంస్కృతిని ప్రతిబింబించే ఈ పండుగను రైతుల పండుగగా పిలుస్తుంటారు. ఈ పండుగలో మొదటి రోజు జరుపుకునే భోగి ఎంతో ప్రత్యేకమైనది. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం లోకి ప్రవేశించే రోజును భోగిగా చెబుతుంటారు. దక్షిణాయనంలో పడిన కష్టాలను, బాధలను అగ్నికి సమర్పిస్తూ ఉత్తాయనంలో సుఖసంతోషాలు కోరుకునేందుకు భోగి మంటలను వేస్తారు..

ఇంట్లోని పాత బట్టలు, పిడకలు, పాత వస్తువులు, భోగి మంటల్లో వేసి అగ్నికి సమర్పిస్తారు. ఈ ఆచారం పూర్వం నుంచి కూడా కొనసాగుతూ వస్తోంది. పురాణాల ప్రకారం శ్రీ మహా విష్ణువుకు ప్రియమైన రోజుగా భోగి పండుగకు పేరుంది. ఈ బోగీ పండుగ రోజున చిన్న పిల్లల తలపై భోగి పళ్ళను పోస్తారు. పిల్లల ఆయుష్షు పెరగాలని, సంతోషంగా ఉండాలని, భోగి రోజున రేగు పళ్ళు, శనగలు, పూలు కలిపి వారి తలపై పోసి దీవిస్తారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తరాలు గడిచే కొద్ది పండగ విశిష్టత మసకబారుతున్నట్లు సిద్దాంత వాదులు చెబుతున్నారు. మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా సంప్రదాయ బద్దమైన పండుగలకు ప్రజలు దూరమవుతున్నారు. కాబట్టి దేశ సంస్కృతికి అద్దం పట్టే సంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సిద్ధాంత వాదులు చెబుతున్నారు..

Also Read:పెదవులు పగిలితే.. ఇలా చేయండి!

- Advertisement -