తారకరత్న చేసిన ఆ తప్పే.. కొంప ముంచిందా!

60
- Advertisement -

గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నందమూరి తారకరత్న నేడు చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురైంది. 39 ఏళ్ల తారకరత్న.. మరో మూడు రోజుల్లో ( ఫిబ్రవరి 22 1983 ) తన పుట్టిన రోజు ముందే మరణించడం ఎంతో విచారకరం. ఇప్పటివరకు తన సినీ జీవితంలో 20కి పైగా సినిమాల్లో నటించిన తారకరత్న.. కేవలం హీరోగానే కాకుండా, విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించి మెప్పించారు. అయితే ఇండస్ట్రీలో నందమూరి వంశం లాంటి పెద్ద ఫ్యామిలీ నుంచి హిరోగా ఆరంగేట్రం చేసినప్పటికీ స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయారు.

2002 లో రిలీజ్ అయిన ఒకటో నెంబర్ కుర్రాడు మూవీతో వెండితెరకు పరిచయం అయిన తారకరత్న.. మొదటి సినిమాతో యావరేజ్ విజయాన్ని అనుడుకున్నప్పటికి యూత్ లో మాత్రం మంచి గుర్తింపు సంపాధించుకున్నాడు. అయితే ఆ టైమ్ లో కథల ఎంపికలో తారకరత్న చేసిన కొన్ని పొరపాట్లే ఆయన కెరియర్ ను ముంచేశాయని కొందరి సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఆ టైమ్ లో తనకంటే చిన్నవాడైనా మరో నందమూరి హీరో జూ. ఎన్టీఆర్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టడం.. మూడవ సినిమాతోనే స్టార్ డమ్ అందుకోవడంతో సహజంగానే తరకరత్నపై కాస్త ఒత్తిడి పెరిగింది. దాంతో ఏకంగా 9 కథలను ఒకేసారి సెలెక్ట్ చేసుకొని ఎవరికి అందని రికార్డ్ ను తారకరత్న తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే తాను ఒప్పుకున్న కథలలో ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఎంతమేర ఉన్నారనే విషయాన్ని మాత్రం తారకరత్న పట్టించుకోలేదు. దాంతో ఒకరో నెంబర్ కుర్రాడు మూవీ తరువాత రిలీజ్ అయిన యువరత్న, తారక్, బద్రాద్రి రాముడు, ఇలా అన్నీ మూవీస్ కూడా ఫ్లాప్స్ బాటా పట్టాయి. దాంతో తారకరత్న కెరియర్ మెల్లగా మసకబారుతూ వచ్చింది. కథల విషయంలో కొంచెం జాగ్రత్త వహించి ఉంటే.. నందమూరి వంశంలో మరో స్టార్ హీరో అయిండేవాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే 2009లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ మూవీలో తారకరత్న నటనకు గాను నంది అవార్డు కూడా దక్కింది. ఏది ఏమైనప్పటికి కథే పట్టించుకోకుండా తొమ్మిది సినిమాలను ఒకేసారి ఒప్పుకొని తారకరత్న తన కెరియర్ ను తానే నాశనం చేసుకున్నాడని విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట.

ఇవి కూడా చదవండి…

పొలిటికల్ ఎంట్రీపై సోనూ..

ఇంటికి వచ్చేస్తున్న సంక్రాంతి సినిమాలు

స్లాంగ్ కోసం దర్శక రచయితల తిప్పలు

- Advertisement -