జనవరిలో భారీ సందడి చేసిన సంక్రాంతి సినిమాలు ఇప్పుడు ఓటిటి రూపంలో ఇంటికి వచ్చేస్తున్నాయి. తెగింపు ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ద్వారా అందుబాటులోకి రాగా వారం రోజులకు పైగా టాప్ వన్ ట్రెండింగ్ లో ఉండటం విశేషం. నిన్న ఆహాలో కళ్యాణం కమనీయం వచ్చేసింది. ఇవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించకపోయినా ఆన్ లైన్ లో చూసే ప్రేక్షకులు భారీ సంఖ్యలో ఉంటారు.
టీవీ సీరియల్ లా ఉందంటూ విమర్శలు తెచ్చుకుని థియేట్రికల్ గా తమిళ్ వెర్షన్ మూడు వందల కోట్ల గ్రాస్ సాధించిన వారసుడు ఈ 22న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ వెయిటింగ్ దీని కోసం ఎక్కువగా ఉంది. మరుసటి రోజు అంటే 23న డిస్నీ హాట్ స్టార్ లో వీరసింహారెడ్డిని ఎంజాయ్ చేయొచ్చు. దీని కోసం సోషల్ మీడియాలో స్పెషల్ పబ్లిసిటీ ఇస్తున్నారు
ఇక 2023 తొలి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య 27న నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమవుతుంది. వ్యూస్ లో పాత రికార్డులు బద్దలు కావడం ఖాయమని టీమ్ బలంగా నమ్ముతోంది. గాడ్ ఫాదర్, భోళా శంకర్ హక్కులు సైతం ఈ ఓటిటి వద్ద ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెలలో డిజిటల్ కంటెంట్ చాలానే వచ్చింది. గాలోడు, లక్కీ లక్ష్మణ్ లాంటి థియేటర్లో ఆడని సినిమాలన్నీ నిక్షేపంగా ఉన్నచోటే ఎంజాయ్ చేయొచ్చు.
ఇవి కూడా చదవండి..

