యంగ్ ట్యాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి విలేకరుల సమావేశంలో ‘పెదకాపు-1’ విశేషాలని పంచుకున్నారు.
పెదకాపు ట్రైలర్ చూస్తుంటే మీ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అనిపిస్తుంది ?
అవును.. ట్రైలర్ నా వాయిస్ తోనే ప్రారంభం అయ్యింది. ఈ మధ్య కాలం చాలా వరకూ తండ్రి పాత్రలే చేశాను. అవన్నీ రెగ్యులర్ గా వుండే పాత్రలే. కానీ పెదకాపులో చాలా భిన్నమైన పాత్ర చేశాను. కథలో చాలా ప్రాధాన్యత వున్న పాత్ర.
పెదకాపులో మీ పాత్ర ఎలా వుండబోతుంది ?
ఇందులో నా పాత్ర సమాజంపై విసిగిపోయిన ఓ మేధావి పాత్ర అనుకొవచ్చు. ఇందులో నాది స్కూల్ మాస్టర్ పాత్ర. స్కూల్ టీచర్ కి సమాజంపై ఒక అవగాహన వుంటుంది. నా పాత్ర దర్శకుడి వాయిస్ ని రిప్రజంట్ చేస్తుంది. ప్రేక్షకుల తరపున ప్రశ్నించే పాత్ర. చాలా అద్భుతమైన వేషం. చాలా రోజులు పని చేసిన వేషం. ఈ చిత్రంలో అన్ని ప్రధాన పాత్రలతో కాంబినేషన్ సీన్స్ వుంటాయి. ఈ మధ్య కాలంలో వన్ అఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. నా కెరీర్ మెమరబుల్ గా నిలిచిపోయే పాత్రది.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గారు ఈ కథ చెప్పినపుడు ఏం అనిపించింది?
శ్రీకాంత్ అడ్దాలా చిత్రాలలో తెలుగు దనం, గోదావరి జీవం, యాస వుట్టిపడుతుంటుంది. సహజంగా దర్శకుడు ఏ ప్రాంతం వాడైతే ఆ పరిమళాలు సినిమాలో వుంటాయి. కానీ పెదకాపులో శ్రీకాంత్ అడ్డాల ట్రాన్స్ ఫర్మేషన్ చాలా భిన్నంగా వుంటుంది. ఇందులో వైలెన్స్ తీవ్రంగా వుంటుంది. ఇందులో నా పాత్ర .. నా కెరీర్లో చెప్పుకొదగ్గదిగా అవుతుందనే నమ్మకం వుంది.
Also Read:సీడబ్ల్యూసీలో లెక్క తేలుతుందా?
కొత్త హీరోతో చేయడం ఎలా అనిపించింది ?
విరాట్ కర్ణ కొత్తలో కొత్త అనిపించాడు కానీ రానురాను తను ఒక పాత్రగా కనిపించాడు. అది నాకు చాలా ఆశ్చర్యపరిచింది. తనలో చాలా అంకితభావం, కసి వుంది. ఖచ్చితంగా ఎదో సాధిస్తాడు.
ఈ చిత్రంలో నాకు మరో అనుబంధం ఏమిటంటే.. ఛోటా కె నాయుడు. నేను చేసిన మొదటి సినిమాకి ఆపరేటివ్ కెమరామెన్ తను. మా మధ్య ఆ అనుబంధం వుంది. చాలా రోజుల తర్వాత చోటా కెమరా నన్ను చాలా థ్రిల్ చేసింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కూడా అద్భుతంగా వుంటుంది.
నిర్మాత గురించి ?
మిర్యాల రవీందర్ రెడ్డి గారు ‘అఖండ’ని ఎంత భారీగా తీశారో ఈ చిత్రాన్ని కూడా అంతే భారీగా నిర్మించారు.
మీ కెరీర్ లో గుర్తుపెట్టుకునే పాత్రలు ఏమిటి ?
కనీసం ఒక ముఫ్ఫై వుంటాయి. మాత్రు దేవో భవ, లేడీస్ ట్రైలర్, కనకమహా లక్ష్మీ రికార్డింగ్స్, శివ, అతడు, మన్మధుడు ఇలా చాలా వుంటాయి. గద్దలకొండ గణేష్ లో చేసింది చిన్న పాత్రే. కానీ ఎందరినో కదిలించింది. ఆ సినిమా చూసి ఎంతో మంది సహాయ దర్శకులు ఫోన్ చేశారు.
కొత్తగా చేస్తున్న సినిమాలు ?
శేఖర్ అనే కొత్త దర్శకుడు చేస్తున్న చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నా. ప్రభుదేవా శివన్న సినిమాలో కూడా మరో ముఖ్యమైన పాత్ర చేశా.నా 40 ఏళ్ల కెరీర్ లో దాదాపు అనుకున్నవన్నీ చేశాను. ఐతే అంతర్జాతీయ స్థాయిలో ఒక సినిమా చేయలనే కోరిక మాత్రం వుంది.
Also Read:Sudheer Babu:మామా మశ్చీంద్ర..సాంగ్