- Advertisement -
ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. బాహుబలి తర్వాత ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్న తమన్నా…వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఇక తాజాగా ఓ టీవీ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు తమన్నా.
జెమినీ టీవీలో త్వరలో ప్రసారం కానున్న మాస్టర్ చెఫ్ ఇండియాకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రొమోని విడుదల చేయగా తెలుగు వంటలని ప్రపంచం అంతా గుర్తించేలా ఈ షోని రూపొందించినట్టు తెలుస్తుంది.
రామ్ చరణ్, రవితేజలు షోకి తొలి గెస్ట్‌లుగా వస్తారని సమాచారం. ఈ టాక్ షోలో 20 ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్’ చిత్రంలో నటిస్తున్న తమన్నా ఎఫ్ 3లో వెంకీకి జోడిగా నటిస్తుంది.
- Advertisement -