జాన్సన్ అండ్ జాన్సన్..సింగిల్ డోస్ టీకా

119
covid

సింగిల్​ డోస్​ కొవిడ్​ టీకా అత్యవసర వినియోగానికి జాన్సన్​ అండ్​ జాన్సన్​ దరఖాస్తు చేసుకుంది. ఆగస్టు 5న దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించింది ఆ సంస్థ. టీకాను ఉత్పత్తి చేసి, పంపిణీ చేయనుంది హైదరాబాద్ కు చెందిన బియాలజికల్-ఈ సంస్థ. సింగిల్ డోస్ టీకా మూడోదశ ట్రయల్స్ లో 85% సమర్ధత కనబర్చినట్లు పేర్కొంది జాన్సన్​ అండ్​ జాన్సన్​ సంస్థ.

గ‌తంలో ఈ సంస్థ ఇండియాలో ప్ర‌యోగాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకొని దానిని ఉప‌సంహ‌రించుకుంది. తాజాగా అత్య‌వ‌స‌ర వినియోగం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఇండియా ప్ర‌జ‌ల‌కు త‌మ సింగిల్ డోసు వ్యాక్సిన్ అందించే దిశ‌గా ఇది చాలా ముఖ్య‌మైన అడుగు అని ఆ సంస్థ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.