తమిళనాడులో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మహిళ మెడలోంచి 5 తులాల బంగారు గొలుసు దొంగిలించారు పంచాయతీ సర్పంచ్. తన ఐదు తులాల బంగారు గొలుసు కనిపించడం లేదని కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు నేర్కుండ్రం నివాసి వరలక్ష్మి(50).
కాంచీపురంలో జరిగిన ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా బస్సులో బంగారు గొలుసు చోరీ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళ. ఆ దొంగతనం చేసింది మరెవరో కాదని.. బస్సులో వరలక్ష్మి పక్కన కూర్చున్న మహిళే అని గుర్తించారు పోలీసులు.
అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆమె తిరుపత్తూరు జిల్లా నార్యంపట్టు పంచాయతీ సర్పంచ్ భారతి(56)గా గుర్తించారు. ప్రజాసేవలో ఉన్న ఓ మహిళ ఇలా ప్రవర్తించడంతో అవాక్కయ్యారు పోలీసులు. నిందితురాలు భారతిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. గతంలో సైతం తిరుపత్తూరు, వెల్లూరు, అంబూరు ప్రాంతాల్లో భారతిపై దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు పోలీసులు.
Also Read:ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?

