తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత TVK అధినేత విజయ్ తొలిసారి దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఇది మొదటి ఢిల్లీ పర్యటన కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
బుధవారం (రేపు) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం విజయ్ సమావేశం కానున్నట్లు సమాచారం . ఈ కీలక పర్యటన కోసం ముఖ్యమంత్రి విజయ్ ఈరోజు సాయంత్రమే చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్న కేంద్ర నిధుల విడుదల వంటి పలు కీలక అంశాలపై ప్రధానితో సీఎం విజయ్ చర్చించనున్నట్లు సమాచారం. నూతన ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాల్సిందిగా ఆయన ప్రధానిని కోరనున్నారు.
కేవలం ప్రధానమంత్రి మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలోని మరికొందరు కీలక పెద్దలను కూడా సీఎం విజయ్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర క్యాబినెట్ మంత్రుల అపాయింట్‌మెంట్ల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు మౌలిక వసతుల కల్పనపై ఆయా శాఖల మంత్రులతో ఆయన ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు.
Also Read:టెక్నాలజీ యుగంలో జాప్యమా?

