విజయ్ కేబినెట్‌లోకి మరో ఇద్దరు!

9
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన కేబినెట్‌లోకి కూటమి భాగస్వామ్య పక్షాలైన వీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) నేతలను చేర్చుకోవడంతో మంత్రివర్గంలో మరో ఇద్దరు కొత్త మంత్రులకు చోటు దక్కింది. అయితే కూటమి పార్టీల ఒత్తిడి, చట్టపరమైన చిక్కుల కారణంగా ఏఐఏడీఎంకే (AIADMK) తిరుగుబాటు ఎమ్మెల్యేలను సీఎం విజయ్ మంత్రివర్గానికి దూరంగా ఉంచారు.

తమిళనాడులో శుక్రవారం (మే 22న) మరో విడత మంత్రివర్గ విస్తరణ జరిగింది. మొదట ప్రభుత్వం వెలుపల నుండి మద్దతు ఇస్తామని ప్రకటించిన విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీలు ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వంలో చేరాయి. పాపనాశం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన ఐయూఎంఎల్ నేత ఏఎం షాజహాన్, తిండివనం నియోజకవర్గం నుంచి గెలిచిన వీసీకే నేత వన్ని అరసు శుక్రవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

గురువారం జరిగిన భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందే, ప్రభుత్వంలో చేరాల్సిందిగా వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలను ముఖ్యమంత్రి కోరారు. అయితే, మంత్రి పదవులకు తగిన ఎమ్మెల్యేల పేర్లను ఖరారు చేయడంలో ఈ రెండు పార్టీలు ఆలస్యం చేశాయి. ఈ ఆలస్యం కారణంగా.. గురువారం నాటి విస్తరణలో కాంగ్రెస్ నుండి ఇద్దరు, తమిళగ వెట్రి కజగం (TVK) నుండి 21 మందితో కలిపి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడులో ముఖ్యమంత్రితో సహా మొత్తం 35 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది. ఇదివరకే ముఖ్యమంత్రితో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడంతో, కేవలం రెండు మంత్రి పదవులు మాత్రమే ఖాళీగా మిగిలాయి. ఈ రెండు ఖాళీలను మే 22న వీసీకే నేత వన్ని అరసు, ఐయూఎంఎల్ నేత షాజహాన్‌లతో భర్తీ చేశారు.అత్యున్నత నిర్ణాయక మండలి అయిన ‘ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్’ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పుడు వారు కోరుతున్నారు.

Also Read;డయాబెటిస్ ముప్పు..వీటితో చెక్!

- Advertisement -