విజయ్ @ తమిళ వెట్రి కజగం

20
- Advertisement -

తమిళనాట మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఎన్నో ఏళ్లుగా కొత్త పార్టీపై ఉగిసలాడుతున్న విజయ్ ఎట్టకేలకు తన పార్టీని ప్రకటించారు. తన పార్టీకి తమిళ వెట్రి కజగం అనే పేరు ఖరారు చేశారు. తమిళ అంటే తమిళం,వెట్రి అంటే విక్టరీ,కజగం అంటే పార్టీ అని వస్తుంది.

గతంలో విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్.. ఒక పార్టీని రిజిస్టర్ చేయించారు. చాలామంది విజయ్ ఆ పార్టీనే ముందుకు తీసుకు వెళ్తారని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కొత్త పార్టీ పేరు ప్రకటించారు. పాలనాపరమైన దురాచారాలు, అవినీతి రాజకీయ సంస్కృతి, కులమత విభజన వంటి దురాచారాలు పై పోరాటం చేయబోతున్నట్లు తెలిపారు విజయ్.

ఈ భూమికి పుట్టుకతో అందరూ సమానమే అనే సమానత్వ సూత్రంతో తాను ముందుకు తీసుకు వెళ్తానని ప్రజాశక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని వెల్లడించారు.కొన్ని రోజులుగా విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సేవలు చేస్తున్నారు విజయ్. ఇక తాజాగా రాజకీయ పార్టీ ప్రకటించడంతో ఇకపై తమిళ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి.

Also Read:షర్మిల దీక్ష.. ఎవరికి లాభం ఎవరికి నష్టం?

- Advertisement -