విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను తమిళ పత్రిక ‘దినమలర్’ ఎడిటర్ ఆర్ ఆర్ రాజగోపాల్ స్వీకరించారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఆయన ఇవాళ తమిళనాడులోని తన కార్యాలయంలో మొక్కలు నాటి ప్రకృతి పట్ల తనకున్న అభిరుచిని తెలియజేశారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్, తనకు ఛాలెంజ్ విసిరిన విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజగోపాల్ గారు మొక్కలు నాటినందుకు గాను స్వామీజీ ఆయనకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. అవని మీద పచ్చదనం పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమైంది. అందులో భాగంగానే ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ సత్ఫలితాలు సాధిస్తోంది. గ్రీన్ ఛాలెంజ్ జనాల్లో ప్రకృతి గురించి, మొక్కల నాటడం లాంటి ఆలోచనను రేకెత్తించిందన్నారు.