“అసురన్” రీమేక్ లో వెంకటేశ్

235
dhanush-venkatesh

విక్టరీ వెంకటేశ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన వెంకీమామ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈమూవీలో వెంకటేశ్ నాగ చైతన్యలు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ దర్శకుడు బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ చాలా రోజుల తర్వాత వస్తున్న భారీ బడ్జెట్ చిత్ర కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇక ఈమూవీ తర్వాత తన తదుపరి సినిమాను కూడా ప్రకటించారు వెంకటేశ్. తమిళంలో భారీ విజయం సాధించిన అసుర చిత్రాన్ని తెలుగులో రిమేక్ చేయనున్నారు. ఈచిత్రంలో వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈమూవీని ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించనున్నారు. జనవరి మొదటి వారంలో ఈచిత్రం రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్రయూనిట్.