షూటింగ్ లో గాయపడ్డ హీరో విశాల్.. విరిగిన కాలు, చేయి

329
vishal accident
- Advertisement -

ప్రముఖ తమిళ హీరో విశాల్ కు తీవ్ర గాయాలయ్యాయి. షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో విశాల్ గాయపడ్డాడు. ఇటివలే టెంపర్ రీమేక్ చిత్రం అయోగ్య షూటింగ్ పూర్తి చేసుకున్న విశాల్..ప్రస్తుతం సుందర్ .సి దర్శకత్వంలో ఓ మూవీని చేస్తున్నాడు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ టర్కీలో జరుగుతుంది. ఇందులో విశాల్ కు జోడిగా తమన్నా నటిస్తోంది.

ఓ ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తున్న సమయంలో , విశాల్ కాలు, చేయి విరిగినట్టు తెలుస్తోంది. కాలికి, చేతికి బ్యాండేజ్ తో ఉన్న విశాల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో ఒక్కసారిగా విశాల్ అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ఫైట్ సీన్ లను డూప్ లేకుండా చేసే విశాల్, ఈ చిత్రంలోనూ అలాగే చేస్తూ గాయపడ్డారని చిత్ర యూనిట్ పేర్కొంది.

సుందర్.సి దర్శకత్వంలో విశాల్ గతంలో రెండు సినిమాలు చేశాడు. విశాల్ చేతికి, కాలుకు గాయం కావడంతో కొద్ది రోజులు విశాల్ రెస్ట్ తీసుకొనున్నారు. ఇటివలే విశాల్ కు హైదరాబాద్ కు చెందిన అనిశా అనే అమ్మాయితో నిశ్చిర్తార్ధం జరిగిన విషయం తెలిసిందే. త్వరలో వీరిద్దరి పెళ్లి జరుగనుంది. పెళ్లికి ముందు విశాల్ ఇలా గాయపడటం అటు ఫ్యాన్స్ కు ఇటు కుటుంబసభ్యలు నిరాశలో ఉన్నారు.

- Advertisement -