డయానా మరియమ్ కురియన్ అంటే ఎంత మందికి తెలుసు…కానీ నయనతార అంటే మాత్రం ఠక్కున చెప్పేస్తారు. కేరళలో పుట్టి మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం, హిందీ సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా తనదైన ముద్రను వెసుకుంది ఈ భామ. ఈ మధ్య వార్తాల్లో ప్రముఖంగా వినిపించడం తరుచూ జరుగుతోంది. అ మధ్య కరణ్ జోహర్ నా దృష్టిలో నయన లిస్ట్ లో లేదు అని అనడం నుంచి నిన్నటి వరకూ భర్తతో కలిసి విదేశాలకు వెళ్లడం వరకు మనకు అందరికి తెలుసు. కానీ గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలైయ్యాయి. నయనతార సినిమా జీవితం నుంచి రిటైర్ అయ్యి వ్యాపార రంగంల్లోకి అడుగుపెడుతుందని ఇప్పటివరకు ఒప్పుకున్న ప్రాజెక్ట్‌లో మాత్రం నటిస్తదని టాక్.
మలయాళం, తమిళం, తెలుగు సినిమాలో స్టార్ల్‌తో కలిసి నటించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, సూర్య, కార్తీ, విజయ్, అజిత్, రజినీకాంత్ లాంటి అగ్ర హీరోలతో నటించిన మలయాళ కుట్టి… త్వరల్లో సినిమాకు గుడ్‌బై చెప్పుతుందని సౌత్ సినిమా టాక్. 2003లో మనసినకారే అనే మలయాళం మూవీ ద్వారా అరంగేట్రం చేశారు.
2006లో వచ్చిన లక్ష్మీ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చంద్రముఖి, గజినీ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల ద్వారా ద్వారా పరిచయం అయ్యారు. ప్రస్తుతం షారుక్ ఖాన్‌తో జవాన్ సినిమాతో హిందీలో కూడా పరిచయమవుతున్నారు. కానీ ఇంతలోనే సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై ఏటువంటి ప్రతిస్పందన లేదు. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న అగ్ర కథానాయికగా పేరు పొందారు.
నయనతార సినిమాల్లో సంపాదించినదంతా ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు. ఆమె నటనకు స్వస్తి పలికి వ్యాపారవేత్తగా రాణించాలకుంటున్నట్టుగా సమాచారం. అయితే నటనకు గుడ్‌బై చెప్పినా నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంత అని తెలియాలంటే నయనతార విఘ్నేష్ శివన్ స్పందించాల్సి ఉంది. వాళ్లు ఈ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. విఘ్నేష్ శివన్ రెండు నెలల క్రితం మహబలిపురంలో వివాహమాడింది. అయితే ప్రస్తుతం ఈ జంట హనీమూన్ లో భాగంగా విదేశాల్లో ఉన్నారు. దీనిపై విఘ్నేష్ స్పందన తర్వాత నయనతార భవితవ్యం ఎంటనేది తెలస్తోంది.