క‌రోనా నుండి కొలుకున్న ప్రముఖ హీరోయిన్‌..

302
Tamannah
- Advertisement -

క‌రోనా వైరస్‌ సామాన్యుల‌నే కాదు సెల‌బ్రిటీలను కూడా వదలడం లేదు. ఇప్ప‌టికే క‌రోనాతో కొంద‌రు ప్ర‌ముఖులు మరణించగా, మ‌రి కొంద‌రు కొలుకున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన హీరోయిన్‌ తమన్నా ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. ఆమధ్య షూటింగ్ కోసం హైదరాబాదుకు వచ్చిన తమన్నాకు కరోనా సోకడంతో, వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్‌లో వుంది. ఇప్పుడు పూర్తిగా తగ్గడంతో ముంబైకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియాలో వెల్లడించింది.

ఇందులో కారులో నుండి దిగ‌గానే త‌న త‌ల్లిదండ్రుల‌ని హ‌గ్ చేసుకోవ‌డం, త‌న పెంపుడు కుక్క‌తో ఆడుకోవ‌డం క‌నిపించాయి. ఇంత తర్వగా కోలుకుంటానని అనుకోలేదు. ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యుల ప్రార్థనలతోనే త్వరగా బమటపడ్డారు. ఇప్పుడు నేనే ఇమ్యునిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని త‌మ‌న్నా పేర్కొంది.

- Advertisement -