టాలీవుడ్ – కోలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలో ఉన్న అగ్రహీరోయిన్లలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. దక్షిణాదిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లో సత్తాచాటేందుకు ప్రయత్నిస్తునే ఉంది. కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీ చేసిన ప్రయత్నాలు కలిసిరాలేదు. బీ టౌన్‌లో ఒక్క ఛాన్స్ అంటూ ఆమె చేయని ప్రయత్నం లేదు.
బాలీవుడ్‌లో ‘హమ్‌షకల్స్’, ‘హిమ్మత్‌వాలా’, ‘ఎంటర్‌టైన్‌మెంట్’ సినిమాల్లో నటించిన తమన్నకు నిరాశనే మిగిల్చాయి. గతేడాది నటించిన త్రిభాషా సినిమా ‘అభినేత్రి’ కూడా ఫ్లాప్ జాబితాలో చేరింది. అయినా… పట్టు వదలని విక్రమార్కుడు తరహాలో తమన్నా హిందీ తెరపై హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
ఇందుకోసం ఏకంగా తన స్టైల్‌ను కూడా మార్చుకుంది తమన్నా. బీ టౌన్ ఈవెంట్లలో క్లీవేజ్ షోలతో అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేస్తోంది. దీంతో ఈ అమ్మడికి మరో హిందీ సినిమా అవకాశం లభించింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో జాన్ అబ్రహం హీరోగా ‘చోర్ నికల్ కే భాగ’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో తమన్నా ఎయిర్ హోస్టెస్ గా కనిపిస్తుందట. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా, తనకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని తమన్నా భావిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా బీ టౌన్‌లో తమ్ము పాగా వేస్తుందో లేదో చూడాలి.
ప్రస్తుతం తెలుగులో తమన్నా నటించిన ‘బాహుబలి–2’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. దీంతో పాటు తమిళంలో మరో మూడు సినిమాల్లో నటిస్తోంది.