విలన్‌ తో తమన్నా డేటింగ్‌?

179
- Advertisement -

మిల్క్‌ బ్యూటీ అనగానే సినీ ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చే పేరు తమన్నా… సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో అటు నటనతో, ఇటు గ్లామర్‌ తో సినీ ప్రేక్షకులను అలరిస్తున్న బ్యూటీ. ఇప్పటికీ తమన్నా అందానికి ఫిదా కాని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.. అందంలోనే కాదు.. డ్యాన్స్‌ లోనూ అప్‌ కమింగ్‌ హీరోయిన్స్‌ కి పోటీగా నిలుస్తోంది తమన్నా.. అయితే తమన్నాపై గత కొంత కాలంగా ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నాలుగుపదుల వయసుకు దగ్గరవుతోన్న ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు.. అయితే ఇప్పుడు తమన్నా పెళ్లి హాట్‌ టాఫిక్‌ గా మారింది. గతంలో కూడా తమన్నా పెళ్లిపై పలువార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేశాయి. అయితే ఈ వార్తలన్నింటిని తమన్నా కొట్టిపారేసింది. ఇప్పుడు తాజాగా తమన్నా పెళ్లిపై మరో టాక్‌ వినిపిస్తోంది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న తమన్నా ప్రేమ వ్యవహారం బయటపడ్డట్లు తెలుస్తోంది. దీంతో 2023 సంవత్సరంలో తమన్నా పెళ్లి జరగనుందనే చర్చ కూడా సాగుతోంది.

తాజాగా జరిగిన 2023 న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ ను గోవాలో జరుపుకుంది. అయితే ఈ పార్టీలో తమన్నా ఓ వ్యక్తిని కౌగిలించుకుని.. ముద్దుపెట్టిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీస్తోంది. తమన్నా ముద్దుపెట్టుకున్న వ్యక్తి ఎవరు అంటూ నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు.అయితే తమన్నా ముద్దుపెట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు.. నటుడు విజయ్ వర్మ అని తెలుస్తోంది. తమన్నా, విజయ్‌ వర్మలు గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్‌ లో ఉన్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీరిద్దరు పార్టీలో ఉన్యోన్యంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. అయితే తమన్నా తన పెళ్లిని వార్తను ఎప్పుడు అనౌన్స్‌ చేస్తుంది అని ఆమె ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. మొత్తానికి తమన్నా ప్రేమ, పెళ్లి వార్త సంచలనంగా మారిందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

విలన్‌ తో తమన్నా డేటింగ్‌?

అమెరికాలో వీరయ్య జోరు

మొక్కలు నాటిన బిగ్ బాస్ శ్రీహాన్…

- Advertisement -