రామ్ చరణ్‌కు విలన్‌గా మిల్కీ బ్యూటీ..!

94
Tamanna

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రోబో శంకర్ దర్శకత్వంలో ఆర్‌సి 15 తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ సినిమా కాస్టింగ్ ని దర్శకుడు ఫైనల్ చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ సరసన కియరా అద్వాణీ కథానాయికగా ఎంపికైంది. అయితే ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో తమన్నా లేడీ విలన్ గా సర్ ప్రైజ్ చేయనుందని సమాచారం.

ఇది హీరోయిన్ కి ధీటైన పాత్ర అని తెలిసింది. ఇక శంకర్ సినిమాల్లో కథానాయికల ఎలివేషన్ ఓ రేంజులోనే ఉంటుంది. అయితే చరణ్ వర్సెస్ తమన్నా ఎపిసోడ్స్ ని ఆయన హైలైట్ చేస్తారనడంలో సందేహమేం లేదు. కాగా ఇందులో మరో హీరోయిన్‌గా తెలుగమ్మాయ్ అంజలికి శంకర్ అవకాశమిచ్చారని ఇంతకుముందు కథనాలొచ్చాయి. పాన్ ఇండియా ఆఫర్ తో అంజలి ఖుషీ అయ్యిందన్న టాక్ వినిపించింది. ఇక ఈ చిత్రంలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు 20 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో మెరిపించనున్నారు.