ఆకట్టుకుంటున్న ‘భూమిక’ ట్రైలర్‌..

49
Aishwarya Rajesh

హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హారర్‌ మూవీ ‘భూమిక’. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 23 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఈ క్రమంలో తాజగా ట్రైలర్‌ విడుదల చేసింది చిత్ర బృందం.

దట్టమైన అడవి లొకేషన్‌, భూమి గురించి వివరించే సంభాషణతో ప్రారంభమయిన ఈ ట్రైలర్‌.. ఓ రోడ్డు ప్రమాదం, ఓ హత్య, ఛేజింగ్‌ సన్నివేశాలతో ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఐశ్వర్య రాజేశ్‌ నటన ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం చాలా బావుంది. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజు సమర్పణలో, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై కార్తికేయన్‌ సంతానం, సుందరం, జయరామన్‌ కలిసి నిర్మించారు.