తమన్నా..పెట్రోమాక్స్‌

988
tamanna petromax
- Advertisement -

అందం, అభినయం కలగలసిన కథానాయికల్లో తమన్నా ఒకరు. పాత్ర ఎలాంటిదైనా దానికి తగ్గట్టు తనను తాను మలుచుకోవడంలో ఈ అమ్మడి తీరే వేరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే అగ్రహీరోయిన్‌గా,మిల్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ్‌ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరాలో కీలకపాత్ర పోషిస్తోంది.

తెలుగు,తమిళ్‌ కాదు ఏ భాషలో అవకాశాలు వస్తే అక్కడ సినిమాలు చేస్తోన్న తమన్నా తాజాగా ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘పెట్రోమాక్స్’ అనే టైటిల్‌ని ఖరారుచేశారు.

ఈగల్‌ ఐ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ఈ మూవీని నిర్మిస్తుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ టైటిల్‌ని సొట్టబుగ్గల సుందరి తాప్సీ అనౌన్స్ చేయగా ఫస్ట్ లుక్‌ని కాజల్ రిలీజ్ చేయనుంది.

- Advertisement -