నూతన సంవత్సర వేడుకలు వస్తున్నాయంటే అందాల తారలు బిజీ అయిపోతారు. డిసెంబర్ 31 రాత్రి వేడుకల్లో డ్యాన్సులు చేయడానికి పెద్ద మొత్తంలో తీసుకుంటూ తమ ఇమేజ్ ని క్యాష్ చేసుకుంటారు. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ 31 రాత్రి ఓ వేడుకలో పాల్గొంటోంది.తమన్న ఆడిపాడేది ముంబయిలో కాదు, హైదరాబాద్ లో కూడా కాదు. గుంటూరులోని ఓ రిసార్ట్ లో ఆమె చిందేయనుంది. ఇందుకోసం భారీ పారితోషికం అందుకోబోతుందని తెలుస్తోంది. ఐటెం సాంగ్స్, ఇతర సినిమా సాంగ్స్ తో ఆ రాత్రి తమన్నా రచ్చ చేయనుంది.
తమన్నా వస్తోందని తెలియగానే.. అటు అభిమానులు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు గుంటూరు రిసార్టుకు క్యూ కట్టేస్తున్నారట. తమన్నా ప్రతీ ఏటా అమెరికాలో జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈసారి హైదరాబాద్, బెంగుళూరు పబ్స్, రిసార్టుల నుంచి ఆమెకు భారీ ఆఫర్సే వచ్చాయట.అయితే చివరగా గుంటూరు రిసార్ట్ వాళ్లు ఇచ్చిన ఆఫర్‌నే తమన్నా ఓకె చేశారట. ఆమెతో పాటుగా మెహ్రీన్, కైరా దత్ తదితర అందాల భామలు కూడా ఆ రోజు అక్కడ డ్యాన్సులు చేస్తారట.ప్రస్తుతం తమన్న తెలుగులో 3సినిమాలు చేస్తోంది. క్వీన్ రీమేక్ తో పాటు కల్యాణ్ రామ్, సందీప్ కిషన్ సినిమాల్లో నటిస్తోంది. మరో హిందీ సినిమా, ఓ తమిళ సినిమా విడుదలకు సిద్ధమయ్యాయి.