తారక్ “జైలవకుశ” షురు..

179
Jr-Ntr

జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత యంగ్ ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై చాలా ఉత్కంఠే నడిచింది. వక్కంతం వంశీ, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్ ఇలా చాలా మంది డైరెక్టర్ల వచ్చి నట్టేవచ్చి మాయమైపోయారు. కానీ తారక్ మాత్రం చివరికి సర్ధార్ గబ్బర్ సింగ్ బాబీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాబీ చెప్పిన కథ తారక్ కు బాగా నచ్చడంతో బాబీతో సినిమాకు రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యామ్ రామ్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దీనికి జైలవకుశ అనే టైటిల్ కూడా కన్పామ్ అయింది. తాజాగా సినిమా ప్రారంభం తేదీని ఫిక్స్ చేశాడు తారక్.
NTR-Babi
జనతా గ్యారేజ్ తర్వాత దాదాపు నాలుగు నెలల పాటు గ్యాప్ తీసుకున్న తారక్ జై లవకుశ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమైయ్యాడు. ఫిబ్రవరి 11న సినిమాను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి దర్శకుడు బాబీ పూర్తీ కసరత్తులు మొదలుపెట్టేశాడట. ఫిబ్రవరి 11న ప్రారంభించి..ఆ నెల చివరలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక వేశారట. ఆగస్ట్ లో సినిమాను రిలీజ్ చేయాలనేందుకు టీం ప్లాన్. గత మూడు చిత్రాల్లో డిఫరెంట్ లుక్ కన్పించిన తారక్ ఇందులో కూడా కొత్త గెటప్ లో దర్శణమివ్వబోతున్నాడట. కమర్షియల్ అంశాలతో పాటు డిఫరెంట్ స్టోరీతో సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. మరి హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్న తారక్‌కు..ప్లాఫ్‌ లో ఉన్న బాబీ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడడోనని అందరిలో ఆసక్తి నెలకొంది. హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించలేదు.

NTR-Babi