సినిమా వాళ్లపై విమర్శలు తగవు: తమన్నా

62
tamanna

కరోనా సెకండ్ వేవ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పలు ఎన్జీవోలు,దాతలు ముందుకొచ్చి తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారు సాయం చేయడం లేదని వస్తున్న విమర్శలపై స్పందించింది తమన్నా.

ఇలాంటి విమర్శల వల్ల సినీ సెలబ్రిటీలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా మాత్రం తాను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. తాను చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పను అని మొదటి నుండి ఇదే చేస్తున్నానని వెల్లడించింది.

సినీ తారల దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటుందని, వారు ఎక్కడికి వెళ్ళినా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారనే అపోహలు అందరూ నమ్మాల్సిన అవసరం ఉందని చెప్పింది. ప్రస్తుతం తమన్నా.. తెలుగులో గోపీచంద్ సరసన ‘సీటీమార్’, నితిన్ హీరోగా వస్తోన్న హిందీ రీమేక్ ‘అంధాదున్’ చిత్రంలో తమన్నా నటిస్తోంది.