అసెంబ్లీ రౌడీకి సన్‌ ఆఫ్ ఇండియాకు లింక్ పెట్టిన మోహన్ బాబు!

39
son of india

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న చిత్రం స‌న్ ఆఫ్ ఇండియా. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై డైమండ్ రత్న బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ , తనికెళ్ళ భరణి , అలీ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇళయ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా టీజర్‌ని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది చిత్రయూనిట్. మోహన్ బాబు ఆల్ టైం హిట్ మూవీల్లో ఒకటైన అసెంబ్లీ రౌడి జూన్ 4న విడుదల కాగా అదే రోజు టీజర్ విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించగా మోహన్‌బాబు పాత్ర చిత్రణ శక్తివంతంగా సాగుతుందనీ , ఆయన శైలి సంభాషణలు ప్రతి ఒక్కరినీ అలరిస్తాయని తెలిపారు.