లాక్‌ డౌన్‌లో కీర్తి సురేష్ ఏం చేస్తుందో తెలుసా..?

55
keerthy

మహానటితో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న నటి కీర్తి సురేషణ్. ప్రస్తుతం తెలుగు,తమిళ,మలయాళ చిత్రాలతో బిజీగా ఉన్న కీర్తి…లాక్ డౌన్‌ సమయంలో తన ఆరోగ్యంపై మరింత దృష్టిసారించింది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే ప‌రిమిత‌మైన కీర్తి సురేష్ యోగ‌స‌నాలు చేస్తూ టెన్ష‌న్ త‌గ్గించుకుంటుంది. కీర్తి ఆస‌నాలు చూసి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతుండగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం కీర్తి నటించిన గుడ్ లక్ సఖి ,మరక్కార్ అనే మలయాళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా మహేశ్‌తో సర్కారు వారి పాట, అన్నాత్తే , సాని కాయిదం (తమిళ ), వాశి మలయాళ మూవీల్లో నటిస్తోంది.