ఆహా.. తమన్నా వెబ్ సిరీస్ ఫ‌స్ట్ లుక్‌..

283
tamannah
- Advertisement -

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘లెవన్త్‌ అవర్‌’ అనే వెబ్‌ సిరీస్‌ను ఆహా ఫ్లాట్‌ఫాం నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను మేక‌ర్స్ సోమవారం విడుద‌ల చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు, రైటర్‌-ప్రొడ్యూసర్‌ ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇక ఫ‌స్ట్ లుక్‌లో త‌మ‌న్నా పొడ‌వాటి రెడ్ గౌనులో క‌నిపిస్తుండ‌గా..జంగిల్‌లో గ‌డ్డి కాల్చివేయ‌బ‌డి ఉన్న‌ట్టు బ్యాక్ డ్రాప్‌లో క‌నిపిస్తోంది. కాగా ఇప్ప‌టికే స‌మంత‌, కీర్తిసురేశ్ ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం సినిమాలు చేస్తుండ‌గా..డిజిట‌ల్ స్పేస్‌లో సినిమాలు చేస్తున్న లిస్ట్‌లో త‌మ‌న్నా కూడా చేరిపోయింది. ఇక త‌మ‌న్నా ప్ర‌స్తుతం ఓ త‌మిళ సినిమాతో పాటు తెలుగులో గోపీచంద్ తో క‌లిసి సీటీమార్ లో న‌టిస్తోంది. హిందీలో బోలే చుడియాన్ చిత్రం చేస్తోంది. ఈ రెండు చిత్రాలు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో ఉన్నాయి.

- Advertisement -