అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టు షాక్‌..

220
Arnab Goswami
- Advertisement -

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. 2018లో ఓ ఇంటీరియర్ డిజైనర్, అతని తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారనే ఆరోపణలతో అర్నాబ్‌తో పాటు మరో ఇద్దరిని బుధవారం ముంబైలోని అలీబాగ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బెయిల్‌ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు అంశాన్ని పూర్తిగా పరిశీలించాలని పేర్కొన్న కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది.

అనంతరం శనివారం విచారణ జరిపిన బాంబే హైకోర్టు దీనిపై సోమవారం ఆర్డర్‌ ఇస్తామని చెప్పింది. అలాగే హైకోర్టును ఆశ్రయించేముందుగా అలీబాగ్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఆయన బెయిల్‌ పిటిషన్‌పై నాలుగు రోజుల్లో ఆ కోర్టు నిర్ణయించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన రాయగఢ్‌ సెషన్స్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

మరోవైపు తన భర్త అరెస్ట్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అతని భార్య అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అర్నాబ్‌కు ముంబై పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

- Advertisement -