గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన మనోజ్ గౌడ్

351
green challenge

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు ఆర్యవైశ్య యూత్ రాష్ట్ర అధ్యక్షులు నగునూరి రాజేందర్. కాట్నపల్లి ప్రాదమిక పాఠశాల విద్యార్ధులతో కలిసి తాళ్లపల్లి ఆగయ్య ఫౌండేషన్ చైర్మన్ మనోజ్ గౌడ్ విద్యార్థులతో కలిసి మూడు మొక్కలు నాటారు.

మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్‌ని విసిరారు. సుల్తాన్‌బాద్ ఎంపీపీ బాలాజీ రావు ,మానకొండూరు జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, నమస్తే తెలంగాణ జిందగీ పేజీ ఎడిటర్ నగేష్ బీరెడ్డిలకు గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు.

ఈ సందర్బంగా మనోజ్ గౌడ్ మాట్లాడుతూ గ్రీన్ ఛాలెంజ్ ను యువత తీసుకొని విరివిగా మొక్కలు నాటి తెలంగాణ రాష్ట్రాన్ని హరితవనం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాట్నపల్లి సర్పంచ్ మోహన్ రెడ్డి , సీపతి నారాయణ గౌడ్, కావటి శ్రీరాములు , పాఠశాల విద్యార్ధులు , ఉపాద్యాయులు , అంగన్వాడి టీచర్లు, నర్సరీ సిబ్బంది పాల్గొన్నారు.

Tallapalli Manoj accepts Green Challenge…Tallapalli Manoj accepts Green Challenge…Tallapalli Manoj accepts Green Challenge