తెలంగాణ అసోసియేషన్ అఫ్ యూనైటెడ్ కింగ్‌డమ్(టాక్)ఆధ్వర్యంలో నిర్వహించనున్న లండన్ బోనాల జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత. జూన్ 25న వెస్ట్ లండన్‌లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. తెలంగాణ పండుగను ఖండాంతరాల్లో వ్యాపించిన తర్వాత ఘనంగా నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పెలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలంతో పాటు వివిధ కార్పొరేషన్ ఛైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు.
Also Read: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు.. జూన్3 రైతు దినోత్సవం
ఈ సందర్భంగా టాక్ అధ్యక్షుడు మాట్లాడుతూ…టాక్ ఆవిర్భావం నుంచి నేటి వరకు మాకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కవిత ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి టాక్ ద్వారా అన్ని రకాలుగా కృషి చేస్తామని అన్నారు. ఎప్పటికప్పుడు సలహాలు సూచనలతో ముందుకు వెళ్తామని అన్నారు. యూకేలోని ప్రవాసులంతా బోనాల జాతరలో కుటుంబ సమేతం హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఇతర వివరాలకు www.tauk.org.uk వెబ్ సైట్ ని సంప్రదించమని తెలిపారు.
Also Read: ” హనుమాసనం “తో అంగస్తంభన దూరం !