టాక్ జర్నలిజం 2025..కేటీఆర్‌కు ఆహ్వానం

7
- Advertisement -

జైపూర్‌లో జరిగే ప్రతిష్టాత్మక ‘టాక్ జర్నలిజం’ ఈవెంట్‌కు ముఖ్య వక్తగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. జూలై 19-20, 2025 తేదీల్లో జైపూర్‌లో జరిగే ‘టాక్ జర్నలిజం 2025’ కార్యక్రమానికి ముఖ్య వక్తగా కేటీఆర్ ఆహ్వానితులయ్యారు. దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ నాయకులు పాల్గొనే అత్యంత ప్రతిష్టాత్మక సమావేశాలలో ఇది ఒకటి.

దక్షిణ భారత రాజకీయాల్లో ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలంగా వినిపిస్తూ, విజన్ ఉన్న వినూత్న నాయకుడిగా పేరు తెచ్చుకున్న కేటీఆర్‌ను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కేటీఆర్ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రిగా తెలంగాణలో చేసిన పాలనా మార్పులు, సాధించిన విజయాల నేపథ్యంలో కేటీఆర్‌ను ముఖ్య వక్తగా అహ్వనిస్తున్నట్లు నిర్వహాకులు తెలిపారు.

తెలంగాణను టెక్నాలజీ మరియు పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దడంలో కేటీఆర్ పాత్ర కీలకమైందని, అంతేకాక దేశ రాజకీయాలపై స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరచగల నాయకుడిగా ఆయనను నిర్వాహకులు పేర్కొన్నారు.టాక్ జర్నలిజం అనేది దేశ విదేశాల జర్నలిస్టులు మీడియా రంగంలోని మార్పులు, ధోరణులు మరియు సవాళ్లపై చర్చించేందుకు కలుసుకునే ఒక ప్రముఖ వేదిక.

Also Read:TBGKS ఇంఛార్జిగా కొప్పుల ఈశ్వర్

ఇప్పటివరకు జరిగిన ఎనిమిది ఎడిషన్లలో రాజదీప్ సర్దేశాయి, రవీశ్ కుమార్, బర్కా దత్, సౌరభ్ ద్వివేది, సుహాసిని హైదర్ లాంటి ప్రముఖ భారతీయ జర్నలిస్టులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా ఎడ్వర్డ్ స్నోడెన్, పులిట్జర్ బోర్డు మాజీ అధ్యక్షుడు యూజిన్ రాబిన్సన్, ఐసీఐజే ఎడిటర్ గెరార్డ్ రైల్, గార్డియన్‌కు చెందిన నిక్ డేవిస్, సండే టైమ్స్‌కు చెందిన క్రిస్టినా ల్యాంబ్ వంటి ప్రముఖులు ఈ వేదికపై పాల్గొన్నారు. గతంలో సచిన్ పైలట్, అసదుద్దీన్ ఒవైసీ, సుబ్రమణ్య స్వామి, జీవీఎల్ నరసింహారావు, రాఘవ్ చద్దా, డీ. రాజా, ప్రియాంకా చతుర్వేది తదితరులు పాల్గొన్నారు. ఈసారి కేటీఆర్ తన ప్రసంగంలో ప్రాంతీయ అసమానతలు, సమాఖ్య విధానం, మారుతున్న భారత రాజకీయాల దిశ వంటి అంశాలను ప్రస్తావించనున్నారు.

- Advertisement -