మల్లన్న సాగర్‌ నీటిని వదలాలి!

8
- Advertisement -

మల్లన్న సాగర్ నుండి నీటిని విడుదల చేయాలని కోరుతూ.. వానాకాలం పంటకోసం మల్లన్న సాగర్ జలలాను కొడకండ్ల కెనాల్ వద్ద కూడవెల్లి వాగులోకి నీటిని వదిలి రైతుల పంట పొలాలకు నీళ్ళు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..నాడు కేసీఆర్ గారు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లను వదిలి పంట సమయానికి నీళ్లు ఇచ్చి పంటలు ఎండిపోకుండా చేశాడన్నారు.

Also Read:అమరావతికి విశాఖ డ్రగ్స్ కేసు

నేడు రేవంత్ ప్రభుత్వం రైతుల మీద కక్ష్య సాధింపులతో నీళ్లు ఇవ్వకుండా రైతుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని అన్నారు. మూడు రోజుల్లో నీళ్లను వదలకుంటే మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -