- Advertisement -
మలాలను చంపేస్తామని హెచ్చరికలు జారీ చేసింది తాలిబాన్ సంస్ధ. 15 ఏళ్ల వయసులోనే బాలికల విద్య కోసం పోరాడిన మలాల మీద 2012లో పాకిస్తాన్‌లో తాలిబాన్ మిలిటెంట్లు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మూడు బుల్లెట్లు ఆమె శరీరంలోకి వెళ్లగా తీవ్రంగా గాయపడింది. ఇప్పుడు ఆమె వయసు 23 ఏళ్లు.
నీతో, మీ నాన్నతో సెటిల్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఇందుకు నువ్వు వెంటనే ఇంటికి తిరిగి రావాలని కోరుతున్నా. ఈసారి ఏ విధంగానూ తప్పించుకోలేవు. చంపేస్తాం అని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది తాలిబాన్ సంస్ధ.మలాలకు వచ్చిన హెచ్చరికలపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని ప్రధాని సలహాదారు రౌఫ్ హసన్ తెలిపారు.
బాలల హక్కుల కోసం పోరాడుతున్న మలాల నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా నిలిచింది.
- Advertisement -