మీ ఆశీస్సులు కావాలి: మలాలా

139
malala
- Advertisement -

నోబెల్‌ పురస్కార గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌ కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల మలాలా… అసర్‌ మాలిక్ అనే వ్యక్తిని నిఖా చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించగా బర్మింగ్‌హామ్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహ వేడుక నిరాడంబరంగా జరిగింది. మాకు మీ ఆశీస్సులు కావాలి.. భార్యభర్తలుగా కొత్త ప్రయాణాన్ని కలసి సాగించడానికి ఆతృతగా ఉన్నాం అంటూ మలాలా పేర్కొంది.

ఆడపిల్లల చదువు కోసం మలాలా చేసిన సేవ‌ల్ని గుర్తిస్తూ.. 2014లో ఆమెకు నోబెల్ శాంతి బ‌హుమ‌తి పుర‌స్కారాన్ని అందజేశారు. పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా.. బాలిక విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. ఇది జీర్ణించుకోలేకపోయిన తాలిబన్లు 2012లో మలాలా చదువుతున్న పాఠశాల బస్సులోకి చొరబడి ఆమెపై కాల్పులు జరపగా తీవ్ర గాయాల పాలయ్యారు. మెరుగైన ట్రీట్ మెంట్ కోసం బ్రిటన్‌‌కు తరలించగా పలు ఆపరేషన్ల తర్వాత మలాలా కోలుకున్నారు. 17 ఏళ్ల అతిచిన్న వ‌య‌సులోనే నోబెల్ అందుకున్న యువ‌తిగా మ‌లాలా గుర్తింపు పొందారు.

- Advertisement -