లాక్‌డౌన్‌కు సహకరిస్తున్న ప్రజలు: మంత్రి తలసాని

246
talasani
- Advertisement -

ప్రజలంతా లాక్‌ డౌన్‌కు సహకరిస్తున్నారని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ కొరొనా నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20వేల బెడ్స్ అందుబాటులో ఉంచాము…. ఇతర రాష్ట్రాల నుంచి వలస జీవులు తెలంగాణలో 10లక్షల మంది ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలతో సమానంగా వలస జీవులకు నిత్యవసర సరుకులు అందిస్తున్నారని చెప్పారు.

టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరూ పాల్గొని ఆహారాన్ని అందిస్తున్నారని…వైద్యపంగా ప్రభుత్వం అన్ని వసతులు కల్పించిందన్నారు. ఇప్పటి వరకు 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న వారందరూ డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. యి.

నిత్యవసర సరుకుల సాకుతో కొంతమంది రోడ్లెక్కుతున్నారు…కొంతమంది దద్దమ్మలు గాలిమాటలు మాట్లాడుతున్నారు.ఇలాంటి సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించొద్దన్నారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్లనే సీఎం విమర్శలు చేశారని…మీరు అధికారంలో ఉన్నప్పుడు మీడియా కు ఇచ్చిన గౌరవం ఏంటో అందరికి తెలుసన్నారు.

రాష్ట్రంలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ నేతలు తెలుసుకొని మాట్లాడాలి…మర్కజ్ వెళ్లిన వాళ్ళను 24 గంటల్లోనే పట్టుకున్నామని చెప్పారు. భాద్యతలు లేవి వ్యక్తులతో మేము మాట్లాడాలా?..ప్రజలు ఎన్ని సార్లు బుద్ధి చెప్పినా కాంగ్రెస్ నేతల్లో మార్పు రావడం లేదన్నారు.

- Advertisement -